సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: తాజగా వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలు సుమారు వెయ్యి రూపాయలు అదనంగా భారీగా పెరిగినందున ఏపీలో హోటల్స్ యాజమాన్యాలు తమ తినుబండారాలు రేట్లు కూడా పెంచడానికి సిద్ధం అవుతున్నాయి. ఇప్పటికే చాల మంది ధరలు పెంచెయ్యడం జరిగింది. రోడ్డు ప్రక్క స్టాల్స్ నుండి హాస్టల్స్, మెస్ లలో కూడా చార్జీలు పెంచేస్తున్నారు. ఇదిలా ఉండగా ఏపీలోని స్టార్ హోటళ్లలో మెనూ ధరలు 10% పెంచాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు ఏపీ స్టార్ హోటళ్ల అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్వీ స్వామి తాజగా ఓ ప్రకటనలో తెలిపారు. పెరిగిన గ్యాస్ ధరలు తదితర పెట్టుబడి ఖర్చుల వల్ల తీవ్ర నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. ఈ పరిస్థితుల్లో వేలాది మంది కార్మికుల ఉపాధిని కాపాడేందుకు, హోటల్ రంగాన్ని నిలబెట్టుకునేందుకు గత్యంతరం లేని పరిస్థితుల్లో ధరల పెంపు నిర్ణయం తీసుకున్నామన్నారు.
