సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, శనివారం మధ్యాహ్నం ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలో ఛోటేబేథియా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గరు జవాన్లు ప్రాణాలు కోల్పోవడం సంచలనం రేపింది.. కాంకేర్-నారాయణపూర్ జిల్లాల సరిహద్దులో మావోయిస్టులు అమర్చిన మందుపాతరలను తొలగిస్తుండగా ఒక్కసారిగా భారీ ఐఈడీ పేలింది. ఈ ప్రమాదంలో అక్కడే ఉన్న ముగ్గురు DRG జవాన్లు తీవ్రంగా గాయపడి అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరొక జవాన్ కి తీవ్రంగా గాయాలయ్యాయి. ఆయన్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మార్చి 31న ఛత్తీస్‌గఢ్‌ను ఇకపై పూర్తిగా మావోయిస్టు ముక్త్ రాష్ట్రంగా అక్కడి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన తర్వాత ఇదే మొదటి పేలుడు కావడం గమనార్హం.
