సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: నువ్వు ఒక్కటిస్తే నీకు నాలుగు ఇస్తా! అన్న తరహాలో అగ్ర దేశం అమెరికా చేసిన దాడులకు ఇరాన్ ఇచ్చిన సమాధానం ప్రపంచాన్ని నివ్వెరపరుస్తూనే ఉంది. హర్ముజ్ ను దిగ్బంధనం చేశామని అమెరికా చెప్పడమే కానీ ఇరాన్ కు చెందిన 30 కి పైగా చమురు నౌకలు చక్కగా విదేశాలకు వెళ్లిపోయాయని సమాచారం. తాజాగా LPG గ్యాస్ ఉన్న భారతీయ భారీ నౌక కూడా హర్ముజ్ ను దాటి ఈనెల 13న విశాఖ తీరం చేరుకోనుంది. ఇటీవల ఒక ఇరాన్ నౌక ను అమెరికా పట్టుకొనిపోతే అమెరికాకు చెందిన 2 నౌకలను ఇరాన్ పట్టుకొనిపోయిందని ప్రపంచ మీడియా చెపుతుంది. గత 2 నెలలుగా బిజినెస్ లేక గల్ఫ్ దేశాలుకు భవిషత్తు భయం కనపడుతుంది. ఇలా యుద్ధ విరామం ఉన్నప్పటికీ పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళా యుద్ధం ముగించేందుకు తాజాగా 14 ప్రతిపాదనల ను అమెరికాకు పాకిస్తాన్ ద్వారా పంపించినట్టు ఇరాన్ ప్రభుత్వ మీడియా ధ్రువీకరించింది. దీనిలో తమకు నష్టపరిహారం క్రింద లక్షల కోట్లు చెల్లించాలని కీలక డిమాండ్ ఇరాన్ చేసినట్లు సమాచారం. ఈ ప్రతిపాదనలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా స్పందించారు (Trump Iran ).యుద్ధాన్ని ముగించేందుకు తాము కూడా ఇరాన్‌కు అమెరికా 9 పాయింట్లతో ఓ ప్రతిపాదన చేశామని, . దానికి ప్రతిస్పందన లేదని తాము మాత్రం ఇరాన్ పంపిన తాజా ప్రతిపాదనలను త్వరలోనే తాను సమీక్షిస్తానని ట్రంప్ తన సోషల్ మీడియా ‘ట్రూత్’ ద్వారా వెల్లడించారు, అయితే గత 47 ఏళ్లుగా ప్రపంచానికి, మానవాళికి కలిగించిన నష్టానికి ఇరాన్ ఇంకా తగిన మూల్యం చెల్లించుకోలేదన్నారు. కాబట్టి ఈ ప్రణాళిక తాను ఆమోదించే విధంగా ఉంటుందని అనుకోవడం లేదన్నారు. మొత్తానికి ఇద్దరు ఒకరిని ఒకరు నమ్మడం లేదు .. కానీ యుద్ధం ముగియకపోతే ప్రపంచ దేశాలు ఆర్ధిక మాంద్యం బారిన పడే రోజులు ఎంతో దూరంలో లేదు.. సిగ్మా ప్రసాద్ కాలమ్స్
