సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రేపటి సోమవారం ఉదయం నుండి దేశవ్యాప్తంగా ప్రజలు 5 కీలక రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ఆసక్తిగా ఉన్నారు. తమిళనాడు, పశ్చిమబెంగాల్, కేరళ, అస్సాం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు రేపే జరగనుంది. ఈ నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రతా బలగాలు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఫలితాలపై పూర్తీ భిన్నమైన అంచనాలతో ఎగ్జిట్ పోల్స్‌ విడుదలైన సంగతి తెలిసిందే. మరో ప్రక్క ఓటింగ్ శాతం రికార్డు స్థాయిలో 95- 86 శాతం వరకు ఉండటంలో ఈవీఎం లో ఎదో జరుగుతుంది.. లేదా భారీ రిగ్గింగులు జరిగాయి అన్న ప్రచారం కూడా బలపడుతుంది. ఇదిలా ఉండగా మన తెలుగు రాష్ట్రాల ప్రజలకు తమినాడు ఫలితాలు ఫై విపరీతమైన ఆసక్తి నెలకొంది.ఏదిఏమైనా మొత్తంగా రేపు ఏఏ రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి రానుందని. ప్రస్తుత సీఎంలు ఎంతమంది తిరిగి అధికారంలోకి వస్తారో? తేలిపోతుంది. ప్రజలు టీవీల ముందుంటారు మరి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *