సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల ఆకివీడు రామాలయం విషయం తెలుగు రాష్ట్రాలలో ఎంతటి సంచలనం రేపిందో ? హిందువులను ఎంత లోతుగా ఆలోచనకు గురిచేసిందో? అందరికి తెలిసిందే.నిజానికి అన్యమతస్తుల స్థలం కబ్జా చెయ్యలేదు.. మరి పురాతన రాములోరి గుడి ని పునర్నిర్మించడం కోసం ఇన్ని అడ్డంకులు అధిగమించాలా ? ఇన్ని దాడులను ఎదుర్కోవాలా? మనుష్యుల రక్తం కారాలా ? ఇలాంటి వాటిని ఎదుర్కోవడానికి అన్ని చోట్ల ‘రఘురామా’ లాంటి మొండి వాళ్ళు ఉండరు కదా? రాములోరి గుడి సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తెచ్చి ‘నువ్వేం చెయ్యగలవు రఘురామా ?అంటూ పూర్తీ వివరాలతో ప్రశ్నించిన ‘సాక్షి’ ప్రతినిధి లాంటి వాళ్ళు కూడా అరుదేకదా? అందరి మీమాంసలకు చెక్ పెడుతూ .. శ్రీ రామ భక్తులకు శుభవార్త! ఆకివీడులో రామాలయం నిర్మాణం అనుమతులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను నేడు, మంగళవారం ఏపీ హైకోర్టు కొట్టివేసింది. రెవెన్యూ రికార్డులను, కరెంట్ బిల్లులను పరిశీలిస్తే గత 80 సంవత్సరాలుగా అక్కడ రామాలయం ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. అన్ని ఆధారాలు, రికార్డులు స్వష్టంగానే ఉన్నాయి అని, వాటిని పరిశీలించిన తరువాత జిల్లా కలెక్టర్, నగర పంచాయితీ కమిషనర్, రామాలయం నిర్మాణానికి అనుమతులు ఇచ్చారని..ఇన్ని ఆధారాలు ఉన్న నేపథ్యంలో పిటిషన్‌ను కొట్టివేస్తున్నామని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. వివరాల్లోకి వెళ్ళితే .. ఇటీవల తాజాగా ఆలయ నిర్మాణానికి ఇచ్చిన జిల్లా అధికారులు శరవేగంగా అనుమతులు ఇచ్చారని..ఇదెలా సాధ్యం?ఇచ్చిన అనుమతులను సవాల్ చేస్తూ రిట్‌ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈరోజు(మంగళవారం) హైకోర్టు ధర్మాసనం విచారణ జరిపి పిటిషన్‌ను పూర్తిగా కొట్టివేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *