సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల ఏపీలో అన్ని పరీక్షా ఫలితాలలో వరుసగా విద్యార్థులు రికార్డు స్థాయిలో ఉత్తీర్ణతలు సాధిస్తున్నారు. తాజగా ఆంధ్రప్రదేశ్ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP POLYCET ) ఫలితాలు నేడు మంగళవారం విడుదలయ్యాయి. ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తాజగా ఎక్స్ వేదికగా ఈ ఫలితాలను ప్రకటించారు. ఈసారి పరీక్షల్లో రికార్డు స్థాయిలో విద్యార్థులు పాల్గొనగా, మొత్తం ఉత్తీర్ణత శాతం 91.37 శాతంగా నమోదైంది. ఈ సంవత్సరం ఏపీ పాలిసెట్ కోసం మొత్తం 1,77,581 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు. వీరిలో 1,63,008 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష రాసిన వారిలో 1,48,950 మంది విద్యార్థులు అర్హత సాధించడం విశేషం. ఈసారి ఫలితాల్లో బాలికలు బాలుర కంటే మెరుగైన ప్రదర్శన కనపరిచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *