సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: గత 15 ఏళ్ళు పాటు పశ్చిమ బెంగాల్ ను అవిచ్చిన్నంగా పాలించిన మమతాబెనర్జీ ఎన్నికల ఫలితాల అనంతరం తొలిసారి మీడియా సమావేశంలో నేడు మంగళవారంనాడు మమతాబెనర్జీ మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో విలన్‌గా ప్రధాన ఎన్నికల కమిషనర్ వ్యవహరించారు. బెంగాల్‌లో ఈవీఎంలను లూటీ చేశారు’ అని మమత ఆరోపించారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు పోలింగ్ ముగిసిన తర్వాత కూడా ఈవీఎం లు 80 నుంచి 90 శాతం కంటే ఎక్కువ బ్యాటరీని కలిగి ఉండటం ఏమిటి? అని ప్రశ్నించారు. పోలింగ్‌కు రెండ్రోజుల ముందే అధికారులు తమ పార్టీపై దాడులు, కార్యకర్తల అరెస్టులు చేశారని అన్నారు 100పైగా సీట్లు లూటీ చేశారని, తాను ఎన్నికల్లో ఓడిపోలేదని చెప్పారు. అందువల్ల తాను రాజీనామా చేసే ప్రసక్తి కూడా లేదన్నారు. రాజ్‌భవన్‌కు వెళ్లనని, రాజీనామా చేయమని తనను ఎవరూ ఒత్తిడి చేయలేరని స్పష్టం చేశారు. తనను కూడా భవనీపూర్‌లో ఉద్దేశపూర్వకంగానే ఒక ప్లాన్ ప్రకారం తనను ఓడించారని, ఆరోపించారు. ఎస్ఐఆర్ నుంచి 90 లక్షల ఓట్లను తొలగించారనీ, కోర్టుకు వెళ్లడంతో 32 లక్షల ఓట్లు చేర్చారని, విమర్శించారు. ఎన్నికల ఫలితాల అనంతరం సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ,అఖిలేష్ యాదవ్, తేజస్వి యాదవ్, హేమంత్ సోరెన్ తదితరులు ఫోను చేసి సపోర్ట్‌గా నిలిచారని చెప్పారు. ‘ఇండి’ కూటమిలోనే తాను కొనసాగుతానని కూడా స్పష్టం చేశారు.
