సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: సుదీర్ఘ కాలం గా నిరక్షణలో ఉన్న విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ఏర్పాటు చేస్తూ కేంద్రం గెజిట్‌‌ను విడుదల చేయడంపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నేడు, మంగళవారం హర్షం వ్యక్తం చేశారు. ఈ రైల్వే జోన్ ఏర్పాటు ద్వారా ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని తెలిపారు. ఏపీ విజ్ఞప్తిని మన్నించి చరిత్రాత్మక గెజిట్‌ను విడుదల చేసిన ప్రధాని నరేంద్ర మోదీ, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. 2026, జూన్ 1వ తేదీ నుంచి విశాఖపట్నం కేంద్రంగా జోన్ అధికారిక కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయని, వాల్తేరు డివిజన్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా పలాస – ఇచ్చాపురం వంటి కీలక సెక్షన్లను విశాఖ డివిజన్‌లో విలీనం చేయడం ద్వారా ఉత్తరాంధ్ర రవాణా రంగం ముఖచిత్రాన్ని మారుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *