సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: గత రాత్రి తమిళనాడు రాజకీయాలు వేగంగా మారాయి. రాహుల్ గాంధీతో కలసి వెళుతున్న విజయ్ పార్టీపై అమిత్ షా ప్యూహం రచిస్తున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. రాష్ట్రంలో 2వ స్థానంలో ఉన్న ‘డీఎంకే’ మరియు 3వ స్థానంలో‘అన్న డీఎంకే’ లు కలసి అదికారం పంచుకోవడానికి సమాలోచనలు జరుగుతున్నాయని వార్తలు భగ్గుమన్నాయి. మొత్తానికి ఏమి జరిగిందో? (తమలో ఎన్ని గొడవలు ఉన్న తమిళ ద్రావిడ పార్టీలు తమ రాజకీయ స్వార్ధం కోసం కేంద్రానికి తలవంచవని విశ్లేషకులు అంటూ ఉంటారు_ కానీ డి ఎంకే అధినేత సీఎం స్టాలిన్ మాట్లాడుతూ.. ప్రజా తీర్పు గౌరవిస్తామని విజయ్ ను సీఎం కాకుండా తాము అడ్డుకోమని, అతనిని సీఎం అయ్యాక కూడా 6 నెలలు పాలనా పరంగా ఇబ్బందులు కూడా పెట్టమని భరోసాఇచ్చారు. దీనితో తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు నేడు గురువారం తాజగా గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. గవర్నర్‌తో టీవీకే అధినేత విజయ్ 40 నిమిషాల భేటీ తర్వాత ఈ కీలక పరిణామం చోటు చేసుకుంది. టీవీకే రాష్ట్రంలో 108 అసెంబ్లీ సీట్లతో టీవీకే అతి పెద్ద పార్టీగా ఉంది. కాంగ్రెస్ 5, విజయకాంత్ పార్టీ వీసీకేల ఐ సిటు మద్దతుతో ఆ పార్టీ బలం 114కు పెరిగింది. 47 ఎమ్మెల్యే ల బలం ఉన్న అన్న డీఎంకే పరోక్షంగా విజయ్ ను బలపరిచే అవకాశం బలంగా ఉంది.
