సిగ్మా తెలుగు డాట్ ఇన్ న్యూస్:మొత్తానికి సినీ హీరో విజయ్ టీవీకే పార్టీకి గుడ్‌న్యూస్ అందింది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 118 ఎమ్మెల్యేల మెజార్టీ లభించింది. ఇప్పటికే విజయ్(tvk vijay) కు 112 మంది ఎమ్మెల్యేల బలం ఉండగా.. మరో ఆరుగురు ఎమ్మెల్యేలు సపోర్ట్ కావాలి. దీంతో తాజాగా వామపక్ష పార్టీలు, వీసీకే పార్టీ విజయ్‌కు మద్దతిచ్చాయి. సీపీఐ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు, సీపీఎం నుంచి ఇద్దరు, అలాగే వీసీకే నుంచి గెలిచిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలు మద్దతిచ్చారు. దీంతో టీవీకే ఎమ్మెల్యేల బలం 118కి చేరింది. అయితే కాంగ్రెస్ కేంద్ర అధిష్టానం రంగంలోకి దిగింది. తమిళనాడు లోని చిన్న పార్టీలకు సైతం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఫోన్ చేశారు. టీవీకే పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మద్దతు ఇవ్వాలని కోరారు. దీనితో తాజాగా CPI, CPM, VCK సపోర్ట్‌తో ప్రభుత్వ ఏర్పాటుకు తమ మద్దతు లేఖలు ఇవ్వడంతో లైన్ క్లియర్ అయ్యింది. దీంతో నేటి సాయంత్రం విజయ్ మరోసారి గవర్నర్‌ను కలవనున్నారు.. దీంతో విజయ్ రేపే (శనివారం) సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు ప్రచారం జరుగుతుంది.
