సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలం ఈడూరు గ్రామంలో నేడు, శనివారం మద్యం మత్తులో ఉన్న తండ్రి చేతిలో కుమారుడు దారుణ హత్యకు గురయ్యాడు. గ్రామంలో స్థానికుడు గణేశ్ ట్రాక్టర్ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. గణేశ్ తరచూ రాత్రి పగలు తేడాలేకుండా మద్యం సేవించడంతో ఇంట్లో కుమారుడికి గొడవలు జరిగేవి. ఈ క్రమంలో అతిగా మద్యం సేవించిన గణేశ్ తన కొడుకు శామ్యూల్‌ రాజు(19)పై దాడి చేశాడు. కత్తెరతో శామ్యూల్‌పై విచక్షణారహితంగా దాడి చేసి పొడవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించగా మార్గమధ్యలోనే మృతిచెందాడు. సమాచారం అందిన వెంటనే అత్తిలి పోలీసులు నిందితుడు గణేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చేతికి అందివచ్చిన కన్నకొడుకును మద్యం మత్తులో తండ్రి అతికిరాతకం చంపిన తండ్రి మత్తు దిగాక ఇప్పుడు తీరికగా కొడుకు కోసం విలపించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *