సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: స్వాతంత్ర్య సమర యోధులు, మాజీ ఎమ్మెల్యే దంతులూరి నారాయణ రాజు కారణజన్ములని ,నారాయణ రాజు భీమవరంలో కళాశాల నిర్మించకపోతే భీమవరంకు ఇంతా చరిత్ర లేదన్నారు. రాజ్యసభ సభ్యులు, పాక సత్యనారాయణ భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు. నేడు, శనివారం . భీమవరం క్విట్ ఇండియా స్థూపం వద్ద శనివారం క్విట్ ఇండియా స్థూప పునః నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో స్వాతంత్య సమర యోధులు దంతులూరి నారాయణ రాజు సంస్మరణ సభ నిర్వహించారు. ముందుగా దంతులూరి నారాయణ రాజు విగ్రహానికి వారు పూలమాలలు వేసి నివాళులర్పించారు. . క్విట్ ఇండియా పునః నిర్మాణ కమిటీ సభ్యులు చెరుకువాడ రంగసాయి, ఇందుకూరి ప్రసాద్ రాజు, అరసవల్లి సుబ్రమణ్యం, కాస్మో పాలిటన్ క్లబ్ అధ్యక్షులు చేకూరి రామభద్ర రాజు తదితరులు పాల్గొన్నారు. అనాకోడేరు దంతులూరి నారాయణ రాజు జిల్లా పరిషత్ హైస్కూల్ అభివృద్ధికి దంతులూరి నారాయణ రాజు మనవడు దంతులూరి గోపి రూ లక్ష సహాయం అందించారని అన్నారు. ఈ కార్యక్రమంలో దంతులూరి గోపి, దంతులూరి మురళి కృష్ణంరాజు, అల్లు శ్రీనివాస్, బీఎస్ ఎన్ ఎల్ రాజు, పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *