సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: హైదరాబాద్ లోని హైటెక్‌సిటీలో గల ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్(HICC)లో జరిగిన సభకు ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఆదివారం హాజరు అయ్యారు. . ఈ సందర్భంగా ప్రధాని మోదీని రాష్ట్ర సీఎం రేవంత్‌ రెడ్డి సత్కరించి వెండి నంది విగ్రహాన్ని బహుకరించారు. ఇక.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శ్రీరాముడి ప్రతిమను మోదీకి బహూకరించారు. ఈసంధర్బముగా ప్రధాని మోడీ తెలంగాణలో సుమారు రూ.9,500 కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం సహా మరికొన్ని ప్రాజెక్టులను ప్రారంభించారు. వీటిలో రూ.3,180 కోట్లతో చేపట్టే రహదారి పనులు, రూ.2,360 కోట్లతో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ ఉన్నాయి. రూ.610 కోట్లతో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ టెర్మినల్‌కు శ్రీకారం చుట్టిన మోదీ.. రూ.1,243 కోట్లతో కాజీపేట-విజయవాడ ట్రిపులింగ్ పనులను ప్రారంభించారు. అనంతరం రూ.1,700 కోట్లతో నిర్మించిన పీఎం మిత్ర మెగా టెక్స్‌టైల్ పార్క్ ప్రారంభత్సవంలో పాల్గొన్నారు. తదుపరి ప్రధాని.. రూ.300 కోట్లతో నిర్మించిన రైలు అండర్ రైల్ బైపాస్ లైన్‌నూ ప్రారంభించారు. జహీరాబాద్‌ పారిశ్రామిక ప్రాంత విస్తరణ, హైదరాబాద్‌-పనాజీ ఆర్థిక కారిడార్‌కు సంబంధించిన నేషనల్ హై వే పనులు, మల్కాపూర్‌లో ఇండియన్‌ ఆయిల్‌ గ్రీన్‌ఫీల్డ్‌ టెర్మినల్‌, హైటెక్‌సిటీలో ఆధునిక క్యాన్సర్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి వంటి కీలక ప్రాజెక్టులున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *