సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: 3న్నర దశాబ్దాల క్రితం సోవియట్ యూనియన్ లో భాగం అయిన దాయాది ఉక్రెయిన్ ను తిరిగి తమలో కలిపిస్తుకోవాలన్న లక్ష్యంతో గత నాలుగేళ్లుగా రష్యా-ఉక్రెయిన్ మధ్య సుదీర్ఘ యుద్ధం జరుగుతూనే ఉంది. ఇప్పటికే సుమారు 35 శాతంపైగా ఉక్రెయిన్ భూ భాగాన్ని రష్యా తిరిగి కలిపేసుకోంది కూడా?.. దీనికి ఉక్రెయిన్ ప్రతిఘటన మాములుగా లేదు. ఇప్పటికే ఇరువైపులా వేలాది మంది చనిపోయారు. అయితే తాజగా ఈ యుద్ధానికి ముగింపు పలికేలా రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మాస్కోలో తాజగా నిర్వహించిన రష్యా ‘విక్టరీ డే’ వేడుకల సందర్భంగా ప్రసంగించారు. ఉక్రెయిన్‌తో యుద్ధం ముగింపు దశకు చేరుకున్నట్లు పేర్కొన్నారు. అయితే శాంతి ఒప్పంద ప్లాన్‌ గురించి వెల్లడించలేదు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో నేరుగా సమావేశం కావడానికి ముందే శాంతి ఒప్పందం కుదుర్చుకోవడం అత్యంత అవసరమని పుతిన్ అన్నారు. ట్రంప్ చొరవతో రష్యా, ఉక్రెయిన్ మూడు రోజుల పాటు తాత్కాలిక కాల్పుల విరమణకు అంగీకరించిన సంగతి తెలిసిందే. ఇది జరిగిన మరుసటి రోజే పుతిన్ ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు ఇరుదేశాల మధ్య యుద్ధాన్ని ముగించేందుకు చర్చలు జరుగుతున్నాయని ట్రంప్ కూడా నిన్న శనివారం వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *