సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలో రైతులు ఆందోళన బాట పట్టారు.కూటమి ప్రభుత్వం ఎన్ని హామీలు ఇచ్చిన పలు కార్పొరేట్ కంపెనీలు అమ్ముతున్న ఆక్వా ఫీడ్స్ రేట్లు అదుపు చెయ్యలేకపోతుందని, , గత రెండు మూడు సంవత్సరాలుగా రొయ్యల ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది.. అసలే కష్టాలలో ఉన్న తమకు తరచూ రేట్లు పెంచి వెయ్యడం రొయ్యల చెరువుల నిర్వహణ పెను భారంగా మారిందని వాపోయారు. భీమవరం నియోజకవర్గం వీరవాసరములో నేడు మంగళవారం ఆక్వా రైతులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించి నేటి నుండి మరోసారి రొయ్యల మేతల ధరలను కేజీకి సుమారు 10 చప్పున ధరలు పెంచి వేయడంతో దీనితో ఎకరా చెరువు నిర్వహణకు ఏకంగా లక్ష రూపాయలు అదనపు పెట్టుబడి పెట్టాలని పేర్కొంటూ రైతులు పలు కంపెనీ ల ఫీడ్స్ బస్తాలను రోడ్లపై వేసి తగుల బెట్టి తమ నిరసన తీవ్రత ను తెలియజేసారు. ఒక ప్రక్క రొయ్య రేటు పడిపోతుంటే మరోప్రక్క సిండికేట్ గా కంపెనీలు మారడం వల్ల మెతలు ధరలను పెంచి వేస్తున్నారని ఆందోళన చేశారు, కేంద్ర మంత్రులు రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులు తమను ఆదుకోవాలని, కాస్త పట్టించుకోవాలని కోరుతున్నారు,ఈ ఆందోళన కార్యక్రమంలో మళ్ళ రాంబాబు (తులసి రాంబాబు) యరక రాజు హరిహర రాజు, యరకరాజు గోపాలకృష్ణరాజు, తోట విజయకుమార్ నాయకులు రైతులు ఆందోళనలో పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *