సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల ప్రధాని మోడీ దేశంలో ప్రజలు ఖర్చులు తగ్గించుకోవాలని, వాహనాలు నడపడం తగ్గించి పెట్రోల్ ఆదా చెయ్యాలని, బంగారం కొనుగోళ్లు నిలిపివేయాలని విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని ఆ మాటలను ఎద్దేవా చేసారు. మోడీ గారు ప్రజలకు నీతులు చెప్పడం కాదు.. ముందు మీరు మీ ఎన్డీయే వాళ్ళు త్యాగాలు మొదలు పెట్టండి. ‘భారీ కాన్వాయ్’ కారులు వద్దు. మీ సీఎం చంద్రబాబు , ఉప సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ వారంలో 3 రోజులు హైదరాబాద్ లోనే ఉంటున్నారు. వారు ముగ్గురు 3 ప్రత్యేక విమానాలును రానూపోనూ వాడుతున్నారు. వారు ముగ్గురు కలపి ఒకే కారులో ప్రయాణిస్తే పెట్రోలు, డబ్బు ఆదా అవుతాయి కదా? వారికీ భారీ కాన్వాయ్ లు అవసరం లేదు వారు ప్రక్క రాష్ట్రము వదలి ఏపీలోని అమరావతి లోనే ఉంటె కోట్ల రూపాయలు ప్రజలు సొమ్ము ఆదా అవుతాయని వ్యంగ్య అస్త్రాలు వేశారు , పేర్ని నాని మాటలు మోడీ చెవినే పడ్డాయో? ఏమో కానీ తన కోసం ఇంధన వినియోగాన్ని తగ్గించేందుకు ప్రధాని తన కాన్వాయ్‌లో కార్ల సంఖ్యను సగానికి తగ్గించాలని అంతేకాకుండా, విద్యుత్ కార్ల వినియోగాన్ని పెంచాలని కూడా ప్రధాని తాజగా సూచించినట్టు తెలుస్తోంది.
