సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వచ్చే జూన్ మొదటి వారంలో విడుదల కానున్న హీరో రామ్ చరణ్ ‘ పెద్ది’ సినిమా లేటెస్ట్ ప్రోమో తాజగా విడుదలయింది. దీని ప్రకారం‘పెద్ది’ సినిమా పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను మే 18న ముంబైలో భారీ స్థాయిలో నిర్వహించబోతున్నారు. “పెద్ది గాడు ఇక్క డ కొడితే బాల్ ముంబైలో పడింది” అంటూ వదిలిన ఈ ప్రోమో కట్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అగ్ర దర్శకుడు సుకుమార్ మార్గదర్శిగా శిష్యుడు చిట్టిబాబు దర్శకత్వంలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు కీలక ప్రధాన పాత్రల్లో, ఏ ఆర్ రెహమాన్ సంగీతంతో సినిమాకు హైప్ పెరిగింది. ముఖ్యంగా ఈ ప్రోమో చివరలో రామ్ చరణ్‌కు సంబంధించిన ఒక కుస్తీ ఫైట్ సీక్వెన్స్ ను చిన్న గ్లింప్స్ గా చూపించారు.
