సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, బుధవారము తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ తన మద్దతు బలాన్ని నిరూపించుకున్నారు. నేడు జరిగిన బలపరీక్షలో 144 మంది ఎమ్మెల్యేలు అధికార టీవీకే పార్టీకి అనుకూలంగా ఓటు వేశారు. మరో 22 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు.మరో ఐదుగురు ఎమ్మెల్యేలు తటస్థంగా ఉన్నారు. ఈ సందర్భంగా మూజువాణి ఓటుకు బదులుగా స్పీకర్ సభలో ఒక్కో సభ్యుడి మద్దతు గురించి అడిగి తెలుసుకుని వారి ఓటును స్వష్టంగా నమోదు చేసుకున్నారు. కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు, వీసీకే, ఐయూఎమ్ఎల్ పార్టీల ఎమ్మెల్యేలు టీవీకేకు అనుకూలంగా ఓటు వేశారు. అన్నాడీఎంకేకు చెందిన పలువురు రెబెల్ ఎమ్మెల్యేలూ విజయ్‌కు మద్దతుగా నిలిచారు. ఇక డీఎంకే ఈ విశ్వాసపరీక్షను పూర్తిగా బహిష్కరించి విజయ్ కు ఒత్తిడి లేకుండా చేసింది.( ఒకవేళ విజయ్ కు అసెంబ్లీ లో ఎవరు మద్దతు ఇవ్వకపోయినా 107 తో గెలుస్తారు) DMK పార్టీకి చెందిన 59 మంది ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. బలపరీక్షలో సీఎం విజయ్ చాల సులువుగా భారీ మెజారిటీ తో గెలుపొందారు. తమిళనాడు పార్టీలలో తమ మధ్య విభేదాలు ప్రక్కన పెట్టి కేంద్రంలోని బీజేపీ ప్యూహానికి చాల దూరంగా అవకాశం ఇవ్వకుండా..వాతావరణం కనపడుతుంది.
