సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించిన పొదుపు సూచనలపై సీఎం చంద్రబాబు స్పందించారు. నేడు, బుధవారం నిడమర్రులో ‘కిమ్స్’ ఆస్పత్రికి భూమి పూజ చేశారు. బైసర్ స్కిల్ వర్సిటీ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, అమలాపురం ఎంపీ హరీశ్ బాలయోగి, మంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. .ప్రధాని ప్రకటించిన 8 పొదుపు సూచనలు ప్రజలు పాటించాలని మరో రెండు రోజుల్లో ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వ పరంగా కూడా ఓ కార్యాచరణ ప్రకటిస్తామని అన్నారు. పెట్రోల్ కొరత వంటి ఇలాంటి క్లిష్ట సమయాల్లో ప్రభుత్వాలతో పాటు… ప్రజలు కూడా బాధ్యతగా ఉండాలని సూచించారు. పెట్రోలు, డీజిల్ వినియోగం తగ్గించాలని.. దీని వల్ల విదేశీ మారకద్రవ్యం ఆదా అవుతుందని పేర్కొన్నారు.. వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది రియాలిటీ అని.. ఇంటి నుంచే ప్రపంచం మొత్తం పనిచేసే పరిస్థితి వస్తుందని.. దీనిని ప్రోత్సహించాలని సూచించారు. దేశం మొత్తం దుబారాను తగ్గించాలని మార్గనిర్దేశం చేశారు. విదేశీ పర్యటనలు ,పెద్ద పెద్ద కాన్వాయ్ వాహనాల్లో వెళ్లటం అందరికీ చాలా పెద్ద ఫ్యాషన్‌గా మారిందని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.
