సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ మహానాడు నిర్వహణపై మాజీ ఎంపీ, నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ తోట సీతారామలక్ష్మి నేడు, బుధవారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. వీరవాసరం భీమవరం మండలాలు మరియు భీమవరం పట్టణ టిడిపి అధ్యక్ష కార్యదర్శులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ.. మే 27,28,29 తేదీలలో నెల్లూరులో నిర్వహించే రాష్ట్ర మహానాడు సభకు ముందుగా నియోజకవర్గ మహానాడు, జిల్లా మినీ మహానాడు నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుందని అందులో భాగంగా భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మహానాడు సభను ఈనెల 18వ తేదీ సోమవారం ఉదయం 9:30 గంటలకు భీమవరం పట్టణంలోని ఆనంద ఫంక్షన్ హాల్ లో నిర్వహిస్తున్నామని ఈ మహానాడు సభకు టిడిపి రాష్ట్ర, జిల్లా కమిటీ నాయకులు, నియోజకవర్గ కమిటీల నాయకులు,అనుబంధ సంస్థల కమిటీల నాయకులు నామినేటెడ్ చైర్మన్, డైరెక్టర్లు దేవాలయ చైర్మన్లు, ధర్మకర్తలు, బ్యాంకు చైర్మన్లు డైరెక్టర్లు, సాగునీటి సంఘాల చైర్మన్లు, డైరెక్టర్లు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరయ్యాలా కమిటీ నాయకులు సమీకరణ చేయాలని పిలుపు నిచ్చారు.
