సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉండి నియోజకవర్గం పాలకోడేరు మండలంలోని కోరుకొల్లు – మైప R&B రోడ్డు నుండి వడ్డిగూడెం గ్రామం వరకు రూ. 60,00,000/- నాబార్డ్ నిధులతో నిర్మించిన నూతన రోడ్డును, మైప గ్రామంలో రూ. 9,00,000/- వ్యయంతో ఏర్పాటు చేసిన మైక్రో ఫిల్టర్ ప్లాంటును శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు నేడు, ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో స్థానిక కూటమి నేతలు, గ్రామా ప్రజలు, పాలకోడేరు సహకార బ్యాంకు చైర్మెన్ కొత్తపల్లి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. రేపు గురువారం భీమవరం శివారు పెదమిరంలోని రాధాకృష్ణ పంక్షన్ హాలులో జరగనున్న తన పుట్టినరోజు వేడుకలకు తన అభిమానులందరికీ ఆహ్వానం పలుకుతున్నట్లు రఘురామా ప్రకటించారు.
