సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఒక ప్రక్క ఇరాన్ యుద్ధం తరువాత అమెరికా డాలర్ మరింత బలపడితే భారత్ లో మాత్రం కనివిని ఎరుగని రీతిలో ఆర్ధిక ద్రవ్యోల్బణం కమ్ముకొంస్తుంది. నేడు, శుక్రవారం అమెరికన్ డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి ఒక దశలో 96.14 వద్ద రికార్డు కనిష్ఠానికి పడిపోయింది.త్వరలో 100 రూపాయలు కు చేరటం ఖాయం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు (Crude Oil) ధరలు పెరగడం, విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులు (FPIs) భారత మార్కెట్ల నుంచి వ్యాపార నిధులను ఉపసంహరించు కోవడం.. తద్వారా రూపాయి విలువ నేటి మధ్యాహ్నం గం.3 ప్రాంతానికి రికార్డు స్థాయి కనిష్ఠానికి పడిపోయింది. అనంతరం కోలుకొని మధ్యాహ్నం నాలుగున్నర సమయానికి 95.82 దగ్గర కదలాడుతోంది. ఈ వారం నమోదైన రూపాయి విలువ కనిష్ఠాల పరంపరలో ఇది ఆల్ టైం పతనం..ఈ నేపథ్యంలో రూపాయి విలువ మరీ ఎక్కువగా పడిపోకుండా నిరోధించడానికి భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) రంగంలోకి దిగి, డాలర్లను విక్రయించడం ద్వారా పరిస్థితిని అదుపు చేసే ప్రయత్నం చేస్తోంది.
