సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నీటిమూటలుగా మారుతున్నాయని ఈ నేపథ్యంలో ఉండి నియోజకవర్గంలో ఇల్లు గుళ్ళు కూల్చి వేస్తున్నారని సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి శ్రీనివాసరావు ఆరోపించారు. అంబేద్కర్ భవనంలో నేడు, శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి జేఎన్వి గోపాలన్ సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కే. సుబ్బారావమ్మలతో కలిసి ఆయన మాట్లాడారు. ఉండి లో అరాచకం రాజ్యమేలుతుందన్నారు స్థానిక ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కాలువల పక్కన ఉన్న పేదల ఇళ్ళను కూల్చివేస్తూ పక్కనున్న భూస్వాములకు ధనవంతులకు వారిని బలి చేస్తున్నారని ఆరోపించారు. భూస్వాములు కాలువలు ను అక్రమంగా పూడ్చివేస్తున్న వారి జోలికి వెళ్లకుండా వారి భూములు విలువ పెంచడమే కర్తవ్యం గా రఘురాం కృష్ణంరాజు పెట్టుకున్నారని విమర్శించారు. ఇటీవల తాజాగా ఉందుర్రులో గత 45 సంవత్సరాలుగా నివాసం ఉంటూ లక్షలాది రూపాయలతో కట్టుకున్న ఇల్లను కూల్చివేశారన్నారు ఎప్పుడో పల్లపు ప్రాంతంలో ఇచ్చిన పట్టాలు పేరు చెప్పి అక్కడ ఇల్లు కట్టకుండా ప్రత్యామ్నాయం చూపకుండా ఇల్లులు కుల్చివేసారన్నారు, తాము సంఘటన స్థలంలో పర్యటన చేశామన్నారు.పక్కనే ఉన్న భూస్వాముల స్థలాలను గాని గెస్ట్ హౌస్ లు గాని ఎక్కడ ప్రభుత్వం కూల్చడం లేదన్నారు. తక్షణమే బాధితులకు మూడు సెంట్లు స్థలం ఇవ్వాలని అలాగే ఇల్లు నిర్మించుకునేందుకు అవసరమైన నగదును కూడా ప్రభుత్వమే భరించాలని ఆయన డిమాండ్ చేశారు. డీఎస్పీ స్ధాయి అధికారులు గెస్ట్ హౌస్ ల లో ఉండి ఇల్లు కూల్చివేస్తున్నారన్నారు
