సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణ వ్యాపార, రాజకీయ ప్రముఖులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వబిలిశెట్టి కనకరాజు గారి బార్య శ్రీమతి అనంత విజయలక్ష్మి (84) నేడు, శుక్రవారం మరణించినందున రాష్ట్ర శాసన మండలి చైర్మన్, కొయ్యే మోషేను తో పాటు పలువురు ప్రముఖులు శ్రీమతి అనంత విజయలక్ష్మి పార్థివ దేహం వద్ద నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రోశయ్య కుటుంబానికి వీరు సన్నిహిత బంధువులు కూడా కావడం రోశయ్య పలు మంత్రి హోదాలలో వీరి ఇంటా విడిది చెయ్యడం గతంలో పలుమారులు జరిగింది.
