సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రధాని మోడీ ఒక ఏడాది పాటు భారతీయలు బంగారం కొనుగోలుకు దూరంగా ఉండండి అని అని పిలుపు ఏ ముహూర్తాన ఇచ్చారో? అంతర్జాతీయంగా కారణాలు ఏవైనా కానీ అప్పటి నుండి బంగారం ధరలు రోజు రోజుకు దిగివస్తున్నాయి. గత వారం చివరి రెండు రోజుల్లో భారీగా తగ్గిన బంగారం ధర నేడు, సోమవారం కూడా ఇదే పంథాలో కొనసాగుతోంది. వెండి రేట్లో మాత్రం పెరుగుదల కనిపించింది. నేడు ఉదయం విజయవాడ, హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,56,220కు దిగజారింది. క్రితం ముగింపుతో పోలిస్తే ధరలో రూ.710ల మేర కోత పడింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి కూడా రూ.650ల మేర తగ్గి రూ.1,43,200కు చేరుకుంది. 1కిలో వెండి ధర మాత్రం ఏకంగా రూ.10 వేల మేర పెరిగి ఏకంగా రూ.3 లక్షల మార్కును తాకింది.
