సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్; తెలుగురాష్ట్రాల్లో ఇటీవల చికెన్, మటన్ రొయ్యలు వంటి నాన్‌వెజ్ ధరలు ఎలా పెరిగిపోయాయి అందరు చుస్తునారు. సాధారణంగా వేసవి కాలం వచ్చిందంటే చికెన్ ధరలు తగ్గుముఖం పడతాయి. ఎండల తీవ్రతకు కోళ్లు త్వరగా చనిపోతాయనే భయంతో పౌల్ట్రీ యజమానులు వాటిని తక్కువ ధరలకే విక్రయిస్తుంటారు. అయితే ఈసారి మాత్రం గత కొన్ని రోజులుగా ఆకాశాన్నంతున్న చికెన్ ధరలు.. నేడు ఆదివారం మాత్రం భారీగా దిగొచ్చాయి. నిన్నటి వరకు మార్కెట్‌లో ఏకంగా రూ.300 నుంచి రూ.350 వరకు పలికిన కేజీ చికెన్ ధర ఇప్పుడు తగ్గుముఖం పట్టింది. .ఇతర జిల్లాలతో పోలిస్తే విజయవాడలో స్కిన్ లెస్ చికెన్ కేజీ ధర ఇంకా రూ. 300 పైనే కొనసాగుతుండగా ,భీమవరం హైదరాబాద్ మరియు మిగిలిన ప్రాంతాల్లో మాత్రం 260-280 లకు భారీగా తగ్గి వినియోగదారులకు ఊరటనిస్తోంది. మటన్ ధరలు మాత్రం జిల్లాల్లో రూ. 700 నుంచి రూ. 800 వరకు ఉంటే, భీమవరం ,హైదరాబాద్ లలో గరిష్టంగా 800- రూ. 1000 వరకు పలుకుతోంది. ఇక కోడి గుడ్లు 30 కలపి హోల్ సేల్ గా భీమవరంలో నేడు ఆదివారం 265 రూపాయలు ధర పలుకుతుంది.
