సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: జూనియర్ మెగా స్టార్ రామ్‌ చరణ్‌ (Ram Charan) హీరోగా ఉప్పెన ఫేం సాన బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘పెద్ది’. జాన్వీ కపూర్‌ కథానాయిక. జూన్‌ 4న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజగా నేడు, సోమవారం పెద్ది సినిమాకు సంబంధించి మూడు నిమిషాల ట్రైలర్‌ విడుదల చేసారు. సినిమా కధ గమనం అంతా ఈ ట్రైలర్ లో పొందు పరిచారు. ఊరు కోసం ఆటలలో పోరాడి ఊరు మేలు కోసం ఎక్కడికో వెళ్లి బ్రతికిన ఒక త్యాగశీలి జీవితం కనపడింది. ఇక ఆకాశం నుండి చుక్కలు రాలతాయి అంటూ ‘జాన్వీ కపూర్‌’ ని చూపిన తీరు, రామ్ చరణ్ ‘కుస్తీ యోధునిగా పోరాట సన్నివేశాలు తో ఈ ట్రైలర్ ను రూపొందించారు. శివరాజ్ కుమార్, జగపతి బాబు పాత్రలు మాములు సన్నివేశాలు పెట్టారు. అయితే ట్రైలర్ కట్ చెయ్యడం అంతటా ఆకట్టుకోలేదని చెప్పాలి. కానీ సినిమాలో ‘సరుకు’ ఉన్నట్లే కనిపిస్తుంది. ఈ చిత్రం తన కెరీర్‌లోనే ప్రత్యేకమని రామ్‌చరణ్‌ ఇప్పటికే పలుమారు చెప్పారు. ఉత్తరాంధ్ర నేపథ్యంలో రూరల్‌ యాక్షన్‌ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *