సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నేడు, సోమవారం భీమవరం ఎన్ వి ఆర్ హాస్పిటల్లో మావుళ్ళమ్మ పిఅమ్మవారి దేవస్థానం ట్రస్ట్ సభ్యులు ‘మిర్తిపాటి గున్నేశ్వరావు’ అధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వైద్య శిబిరాన్ని టీడీపీ ఇంచార్జి మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి ప్రారంభించి మాట్లాడారు. ప్రతి మహిళ తప్పనిసరిగా పౌష్ఠికాహారం తీసుకోవడంతో పాటు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలను చేయించుకోవాలన్నారు. ప్రతి మహిళ కుటుంబానికి వెన్నెముక లాంటిదని, మహిళ ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం సుఖ సంతోషాలతో ఉంటుందన్నారు. టిడిపి రాష్ట్ర నాయకులు మెంటే పార్ధసారధి, రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు, వేండ్ర శ్రీనివాస్ మాట్లాడుతూ ..మహిళలకు ఆరోగ్యం పట్ల అవగాహన ఉండాలన్నారు. ఆరోగ్యాలు సరిగా లేనప్పుడు వైద్య శిబిరాలకు వస్తారని అలా కాకుండా ముందస్తుగానే పరీక్షలు చేయించుకోవాలన్నారు. డా ఎన్ విఆర్ గోపాలరాజు, డా లక్ష్మీ ప్రత్యూష మాట్లాడుతూ ప్రస్తుతం మనలో ఆహార అలవాట్లు మారాయని, కష్టపడడం కూడా తగ్గిపోయిందని, అందువల్ల రోగాలు కూడా పెరిగిపోవడం జరుగుతోందన్నారు. ఏ రోగాలు రాకుండా ఏమి జాగ్రత్తలు తీసుకోవాలన్న మెడికల్ క్యాంపుల ద్వారా తెలుసుకోవాలన్నారు. అనంతరం మహిళలకు ఉచిత ఆరోగ్య పరీక్షలను నిర్వహించారు. కార్యక్రమంలో స్థానిక పట్టణ టీడీపీ నేతలు నేతలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *