సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశంలో కారుల వాడకం అపి పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గించండి ..మంత్రులు ప్రజా ప్రతినిధులు భారీ కార్ల తో కాన్వాయ్ లు వద్దు.. అంటూ ప్రధాని మోడీ పిలుపు మేరకు.. ప్రజలలో, నేతలలో చైతన్యం కోసం భీమవరంలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ నిన్న ఆదివారం రాత్రి స్వయంగా ఎలెక్టికల్ బైక్ ఫై పలు కార్యక్రమాలకు ఎటువంటి కార్ల కాన్వాయి లేకుండా రక్షణ లేకుండా స్వయంగా హాజరు అయ్యి అందరిని షాక్ కి గురిచేసారు. ఇదే షాక్ అనుకుంటే.. నేటి సోమవారం ఉదయం కూడా ఆయన సామాన్యుడిలా హడావిడి లేకుండా రోడ్లపై నిలబడి ఎలెక్టికల్ బైక్ నడుపుతున్న వారిని ‘లిఫ్ట్’ అడిగి వెనకాల కూర్చుని పట్టణంలో మంచి ఎండలో పలు దుకాణాలకు వెళ్లారు. రోడ్డు ప్రక్కన కొబ్బరి బొండాలు తాగారు. వ్యాపారులతో పశ్చిమాసియా లో యుద్ధ ఉద్రిక్తల నేపథ్యంలో దేశంలో పరిస్థితులను ఆర్ధిక మాంద్యం రాకుండా చెయ్యవలసిన పొదుపు చర్యలు ,వారి అభిప్రాయాలు ఒక సామాన్యుడు గా చర్చించారు. ప్రజలు కు నీతులు చెప్పకుండా తామే చేతలతో రంగంలోకి దిగితే ఎలా ఉంటుందో ? మన శ్రీనివాస్ వర్మ ను చుస్తే అర్ధం అవుతుంది.
