సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపుతున్న ఆకివీడు రామాలయ పునర్నిర్మాణం అన్ని అడ్డంకులు అధిగమించి గత హైకోర్టు తీర్పు మేరకు శంకుస్థాపన తో నిర్మాణ పనులు ప్రారంభించి కొద్దీ రోజులయిన కాకముందే.. మరోసారి ప్రముఖ లాయర్, జడ శ్రవణ్ కుమార్ ఈసారి సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా … ప్రస్తుతానికి రామాలయ నిర్మాణం వెంటనే ఆపివేయాలని stay ఆదేశాలు ఇచ్చింది. ఈ పరిణామాలపై రాష్ట్ర అసెంబ్లీ ఉపసభాపతి రఘురామా కృష్ణంరాజునేడు, మంగళవారం భీమవరం పట్టణ శివారులోని పెదమిరంలోని తన కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ..సుప్రీం కోర్ట్ ఆదేశాలను గౌరవించి రామాలయ నిర్మాణం ప్రస్తుతానికి నిలిపివేస్తామని అయితే కోర్టులో విచారణలో గెలిచిన తదుపరి ఆలయ నిర్మాణం పూర్తీ చేసి తీరుతామని భరోసా ఇచ్చారు. ఇప్పటికే ఎన్నో సార్లు హిందువులు రామభక్తులు రామాలయం పునర్ నిర్మించుకొంటామంటే అడ్డుకొంటున్నారని, విసిగిస్తున్నారని, లాయర్ జడా శ్రవణ్ కుమార్, కొందరు క్రైస్తవ సంఘాలు రాములోరి గుడిని అడ్డుకొంటున్నాయని, ఎన్ని సార్లు, తాము కోర్ట్ లలో గెలిచిన పడే పడే అసత్యాలు చెప్పి పిటిషన్స్ వేస్తూనే ఉన్నారని, తనను చంపుతామని బెదిరిస్తున్నారని, నాకు ‘గన్’ సెక్యూరిటీ ఉంటుంది కాబ్బటి వారి సంగతి చేసుకొంటారు.. అయినా పరమత సహనంతోనే ఉన్నామని రఘురామా పేర్కొన్నారు. 20 శాతం క్రైస్తవ ఓట్లు ఉన్నాయని వారు బెదిరిస్తే .. 80 శాతం హిందువుల ఓట్లు ఉన్నాయని మరి ఈ ‘చిన్న లాజిక్’ ను ఎందుకు మిస్ అవుతున్నారో? రాజకీయ పార్టీల పెద్దలకు తెలియాలని సంచలన వ్యాఖ్యలు చేసారు. ఏది ఏమైనా గౌరవ కోర్ట్ ఆదేశాల మేరకు ఆక్రమణలో ఉన్న అన్ని మతాల ప్రార్ధన స్థలాలను తొలగించవలసి ఉందని, ఆకివీడులో అనుమతులులేని చర్చిలు కోకొల్లుగా ఉన్నాయని వాటిఫై చట్టప్రకారం చర్యలు తీసుకొనే పనిలో ఇకపై ఉంటానని, అలాగే క్రైస్తవ పెద్దలు ఎక్కడైన అనుమతులు లేని దేవాలయాలు ఉంటె వాటిపై ద్రుష్టి పెట్టవచ్చునని పిలుపు నిచ్చారు,
