సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: బూత్ స్థాయి నుండి భారతీయ జనతా పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు పార్టీ మండల అధ్యక్షులు కృషి చేయాలని జూన్ నెలాఖరు నాటికి అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో పార్టీ కార్యాలయాల ప్రారంభం అవుతాయని, ఈనెల 30, 31 తేదీలలో నిర్వహించబోయే శిక్షణా తరగతులకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హాజరుకావాలని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పిలుపునిచ్చారు. నేడు మంగళవారం భీమవరంలోని BJP జిల్లా పార్టీ కార్యాలయంలో, జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి అధ్యక్షతన నిర్వహించిన బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశానికి కేంద్ర మంత్రి ముఖ్య అతిథిగా హాజరై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ మాట్లాడుతూ.. జూన్ నెలాఖరు నాటికి నర్సాపురం పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలలో బీజేపీ కార్యాలయాలను తప్పనిసరిగా ప్రారంభించి, ప్రజలకు అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు. అలాగే జూన్ నెలలో తాను ప్రతి మండలంలో విస్తృతంగా పర్యటించడంతోపాటు పార్టీ మండల సమావేశాలకు స్వయంగా హాజరై స్థానిక నాయకత్వంతో క్షేత్రస్థాయి సమీక్షలు జరుపుతానని తెలిపారు.ఈ సమావేశంలో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీ ప్రసన్న, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ముళ్ళపూడి రేణుక, రాష్ట్ర కార్యదర్శి భోగిరెడ్డి ఆదిలక్ష్మి, సీనియర్ నాయకులు నార్ని తాతాజీ, జిల్లా ప్రధాన కార్యదర్శులు కలిదిండి వినోద్ వర్మ, తోట గంగరాజు,స్థానిక నేతలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *