సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎట్టకేలకు భారత పారిశ్రామిక దిగ్గజం ‘అదాని’పై అమెరికా కోర్టులలో ఉన్న కేసులు ఉపసంహరించు కొన్నట్లు సమాచారం. దీని కోసమే ఇప్పటి వరకు భారత్ అమెరికా టారిఫ్ లు నిబంధనలు ఓరిమితో భరిస్తుందని ప్రతిపక్షాలు ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. ఇదిలా ఉండగా భారత్‌లో ఈ ఏడాది సెప్టెంబర్‌ 12,13 తేదీల్లో జరగనున్న బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధినేత షీ జిన్‌పింగ్ హాజరుకానున్నట్టు తెలుస్తోంది. న్యూఢిల్లీ వేదికగా జరగనున్న ఈ సమావేశాలకు పుతిన్ హాజరవుతారని దక్షిణాఫ్రికాలోని రష్యా ఎంబసీ ధ్రువీకరించినట్టు స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి. జిన్‌పింగ్‌ కూడా ఈ సమావేశాలకు హాజరయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలుస్తోంది. 2019లో జిన్‌పింగ్ భారత్‌లో పర్యటించారు. ఆ తరువాత రష్యాలో కజాన్ వేదికగా జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో మోదీ, జిన్‌పింగ్‌లు సమావేశమయ్యారు. బ్రిక్స్ కూటమిలో ఉన్న ఇరాన్ యుద్ధం విషయంలో బ్రిక్స్ కూటమిలో భేదాభిప్రాయాలు నెలకొన్నాయన్న వార్తల నడుమ ఈసారి సమావేశాలు కీలకంగా మారాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *