సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్:తెలుగునాట‘బంగారు తల్లి‘గా ప్రసిద్ధి పొందిన భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్లమ్మ అమ్మవారిని చీరతో సహా 100 కేజీల పూర్తీ స్వర్ణమయంతో తీర్చిదిద్దేందుకుగత 2 దశాబ్దాలుపైగా భక్తులు దాతలు కృషి చేస్తున్నారు. అప్పటికే శ్రీ అమ్మవారికి వజ్రాలు పొదిగిన బంగారు కిరీటం అలంకరించారు. 2004 నుండి స్థానిక మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ హయాంలో ‘బ్యాటరీ మూర్తి’ సహకారంతో పెద్ద ఎత్తున కృషి జరిగింది,ఈనేపథ్యంలో శ్రీ అమ్మవారికి బంగారు ఖడ్గము బంగారు త్రిసూలం, నాగాభరణం, ఘట్టం తో సహా 50 కేజీల పైగా బరువున్న బంగారు ఆభరణాలు అమరాయి. తరువాత ప్రస్తుత ఎమ్మెల్యే అంజిబాబు హయాంలో కారుమూరి సత్యనారాయణ సహకారంతో, కృషి కొనసాగించారు. ఇక మరో 23 కేజీల బంగారం భక్తులు కానుకల రూపంలో ఇప్పటికే అందించారు. మరో 27 కేజీల బంగారం సేకరించ గలిగితే 50కేజిలతో నిలువెత్తు శ్రీ అమ్మవారికి బంగారు చీరతో కవచం ఏర్పాటు చెయ్యవలసి ఉంది. నిజానికి 2020 తరువాత కరోనా అడ్డంకి రాకుండా బంగారం ధరలు భారీ ఎత్తున పెరగకుండా ఉండి ఉంటెమరల ఎమ్మెల్యేగా గ్రంధి శ్రీనివాస్ హయాంలోనే ఇప్పటికే ‘సంపూర్ణ స్వర్ణ అమ్మవారు’ గాదర్శనమిచ్చి ఉండేవారు. ఇదిలా ఉండగా రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్లపాటు ఉండే విధంగా సంపూర్ణ స్వర్ణ అమ్మవారు ప్రాజెక్టు కమిటీని తాజగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ కమిటీలో 12 మందిని నియమించారు. ఈ కమిటీలో ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, దేవదాయ డిప్యూటీ కమిషనర్‌, బుద్దామహాలక్ష్మి నగేష్‌, శ్యాం సిల్క్స్ రమేష్‌ అగర్వాల్‌,ఎం. వీరవెంకట సత్యనారాయణ, జి.వెంకటరమణ, పొత్తూరి బాపిరాజు, బి.రామ్మోహన్‌రావు, కె.వెంకటరమణారావు, బి.నాగభూషణం, ఎస్‌.శివసత్యనారాయణ కమిటీలో ఉన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *