సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం బ్రాండ్ ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా సూపర్ స్టార్ గా ఎదిగిపోయాక ఆయన రేంజ్ మాములుగా లేదు. హిట్ అయితే వెయ్యి కోట్లు పైగా వసూళ్లు ఒకేవేళ సినిమా పోయిన 300 కోట్ల కలెక్షన్స్ ఖాయం.. అది ప్రభాస్ రాజుగారి రేంజ్..మొన్నటికి మొన్న రాజాసాబ్ సినిమా కు కూడా ఒక సూపర్ డూపర్ హిట్ సినిమాకు వచ్చినట్లు భీమవరంలోనే కోటి న్నర పైగా కలెక్షన్ అవలీలగా వచ్చేసింది. ఇక టీవీలోనూ ఓటిటి లలోను ప్రభాస్ సినిమా చూసే ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులకు అంతే లేదు. ఆర్మాక్స్ మీడియా అనేది భారతదేశంలోని ప్రముఖ మీడియా కన్సల్టింగ్ మరియు డేటా అనలిటిక్స్ సంస్థ. సినిమా పరిశ్రమ, టెలివిజన్ మరియు ఓటీటీ (OTT) రంగాలకు సంబంధించిన కంటెంట్, స్టార్స్ పాపులారిటీపై ఇది ప్రతి నెలతో పాటు ప్రతి ఏటా ప్రత్యేక సర్వేలు నిర్వహిస్తుంది. తాజాగా ఈ ఏడాది మోస్ట్ పాపులర్ స్టార్స్ లిస్ట్ ని ఆర్మాక్స్ విడుదల చేసింది. అందులో మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నారు ప్రభాస్. గత నాలుగేళ్లుగా ప్రభాస్ నే నెంబర్ 1 మోస్ట్ పాపులర్ మేల్ స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. ఇలా ఎన్నిక కావడం ప్రభాస్ కు వరుసగా 4వ సారి కావడం ఒక రికార్డు. ఈసారి టాప్ 10 లో ఎక్కువగా టాలీవుడ్ హీరోలు ఉండడం విశేషం. అల్లు అర్జున్ మూడో స్థానంలో ఉన్నారు. ఇక 5 వ స్థానంలో మహేష్ బాబు.. 7వ స్థానంలో రామ్ చరణ్ ఉన్నారు. చివరగా టాప్ 10 లో ఎన్టీఆర్ నిలబడ్డారు. టాప్ 10 లో 5 స్థానాలు టాలీవుడ్ స్టార్స్ నిలబడడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
