సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: దాదాపు నెల రోజుల విరామం తరువాత నేడు, గురువారం వైసీపీ అధినేత , మాజీ సీఎం జగన్ తాడేపల్లి లోని తన నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సీఎం చం ద్రబాబు, ఇటీవల చీటికి మాటికి వైసీపీని గొడ్డలి పార్టీ అనడం ఏమిటని, ఎవరిదయ్యా గొడ్డలి పార్టీ? ఎవరిదయ్యా గన్ కల్చర్? ఎవరిదయ్యా హత్యా రాజకీయాల సంస్కృతి? అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించారు. మా తాత రాజారెడ్డిని చంపింది టీడీపీ వాళ్లే కదా? మా తాత.. చిన్నాన్న ఏం చేశారు? ఆ కేసుల్లో దోషుల్ని టీడీపీ ఆఫీసులో దాయలేదా? ఎవరిది క్రిమినల్ బ్రెయిన్ అం టూ ప్రశ్నించారు. జగన్ మంచోడు కాబట్టే మాతాత రాజారెడ్డిని నరికి చంపిన వాళ్ళు ఇవాళ్టికీ బతికే ఉన్నారని అన్నారు. .వైఎస్ఆర్ హెలికాప్టర్ ఘటనను గుర్తు చేస్తూ.. గతంలో సీఎం వై ఎస్ ఉద్దేశించి.. నువ్వు అసెంబ్లీకి ఎలా వస్తావో చూస్తానని, చంద్రబాబు మాట్లాడిన రెండు లేదా మూడు రోజులకే మా నాన్న(వైఎస్ఆర్) హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారని వివరించారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే మా చిన్నాన్న వివేకానందరెడ్డి హత్యకు గురైందని వాస్తవం కాదా? అంటూ నిలదీశారు. మీ బావ బాలకృష్ణ ఇద్దరిపై కాల్పులు జరిపి హత్యాప్రయత్నం చెయ్యలేదా? బాలకృష్ణ ఇంటి ముందు గార్డ్ చనిపోలేదా ? హరికృష్ణ పార్థివ దేహం దగ్గర కెసిఆర్ తో రాజకీయ పొత్తు కోసం చంద్రబాబు మాట్లాడింది నిజంకాదా ? లోకేష్ ఏమి మాట్లాడతాడో కానీ, ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి ,పెద్దాయనను పార్టీ నుండి గెంటేసి పార్టీని దొంగిలించింది మీ నాయనకు నాకు పోలిక? నేను స్వంతగా పార్టీ పెట్టి పోరాడి నిలబడ్డాను.. ఇటీవల చంద్రబాబు నిద్ర లో ఉండగా ఎవరైనా ‘మావిగన్’ అంటే చాలు ఆయన గుండె ఆగిపోయేలా ఉంది అని ఎద్దేవా చేసారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి సర్వము దోచేశారు. సర్వనాశనం చేసారు. రాష్ట్రంలో స్వప్రయోజనాల కోసం ప్రజలకు ‘పెట్రోలు కొరత’ పెట్టినందుకు కేంద్రం చివాట్లు పెట్టలేదా ?సంపద సృష్టిస్తానని చెప్పి ‘సంతానాన్ని పెంచండి’ 3వ బిడ్డకు 30 వేలు 4వ బిడ్డకు 40వేలు ఇస్తామంటున్నారు. సూపర్ సిక్స్ అంటూ ప్రజలకు వెన్నుపోటు పొడిచారు. ఇదేనా మీ పాలనా ? అని జగన్ ప్రశ్నించారు.
