సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం డీఎన్ఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (DNRCET) లో ఉన్నత్ భారత్ అభియాన్ (Unnat Bharat Abhiyan – UBA) విభాగం ఆధ్వర్యంలో “ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా గ్రామీణ యువతకు సాధికారత” (Empowering Rural Youth through AI) అనే అంశంపై నేడు, శుక్రవారం అవగాహన సదస్సు (వర్క్‌షాప్) నిర్వహించారు.కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండంట్, గాదిరాజు సత్యనారాయణరాజు (బాబు ) మాట్లాడుతూ.. ప్రస్తుత డిజిటల్ యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కీలక పాత్ర పోషిస్తోందని, గ్రామీణ ప్రాంతాల యువత ఈ సాంకేతికతను ఒడిసిపట్టుకుంటే అద్భుతమైన ఉపాధి అవకాశాలను పొందవచ్చని పేర్కొన్నారు. కేవలం నగరాలకే పరిమితం కాకుండా, గ్రామీణ విద్యార్థులకు కూడా ఏఐ టూల్స్, మెషిన్ లెర్నింగ్ మరియు డేటా అనలిటిక్స్ వంటి ఆధునిక సాంకేతికతలపై అవగాహన కల్పించడమే ఈ వర్క్‌షాప్ ముఖ్య ఉద్దేశమని తెలిపారు.
