సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో ప్రజలు ఆరోగ్యం కోసం పారిశుధ్య కార్మికులు అందిస్తున్న సేవలు వెల కట్టలేనివి. భీమవరం పట్టణంలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో భాగంగా నేటి శనివారం ఉదయం 5:30 గంటలకు స్థానిక ప్రకాశం చౌక్ నందు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. కార్యక్రమంలో భాగంగా ప్రధాన రహదారుల స్వీపింగ్, కాలువలలో పేరుకుపోయిన చెత్త, మురుగు మరియు వ్యర్థ పదార్థాల తొలగింపు చేపట్టడంతో పాటు రోడ్ల పక్కన పేరుకుపోయిన చెత్తను తొలగించి పరిసరాలను పరి శుభ్రం చేసారు.. ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తూ, పట్టణాన్ని పరిశుభ్రంగా మరియు ఆరోగ్యకరంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని అధికారులు సూచించారు.ఈ కార్యక్రమానికి గౌరవ స్పెషల్ ఆఫీసర్ & ఆర్.డి.ఓ. , మున్సిపల్ కమిషనర్ , అసిస్టెంట్ కమిషనర్ , ఎం.హెచ్.ఓ. మరియు ఇతర శాఖల అధికారులు, ఛాంబర్ అఫ్ కామర్స్ సభ్యులు, వివిధ స్వచ్ఛంద సంస్థలు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *