సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మక నిర్వహిస్తున్న హైబ్రిడ్ వర్చువల్ మహానాడు క్లస్టర్ సమావేశాలలో భాగంగా భీమవరం నియోజవర్గం 8వ క్లస్టర్ సమావేశాన్ని మాజీ ఎంపీ నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి తోట సీతారామలక్ష్మీ, సీనియర్ నేత మెంటే పార్ధ సారధి తో స్థానిక టీడీపీ నేతలతో కలసి ప్రారంభించి పట్టణంలోని 3 క్లస్టర్ సాహితీ ఫంక్షన్ హాల్, 4 క్లస్టర్ చాంబర్ ఆఫ్ కామర్స్ హాల్, 5 వ ఆదిలక్ష్మి రజక కమ్యూనిటీ హాల్, 6వ క్లస్టర్ శ్రీకృష్ణదేవరాయ ఫంక్షన్ హాల్ ఏడో క్లస్టర్ ప్రొనౌన్స్ ఫంక్షన్ హాల్ ఎన్నో క్లాస్టర్ ఎన్సి కళ్యాణ మండపం,9 క్లస్టర్ కొవ్వాడ అన్నవరం లో నిర్వహించిన క్లస్టర్ మహానాడు సమావేశాలలో హాజరయ్యారు. ..నా తెలుగుదేశం నా బాధ్యత నినాదం’తో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని టిడిపి నాయకులకు అందించి రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి వర్చువల్ క్లస్టర్ సమావేశాలు నిర్వహించడం దేశ చరిత్రలోనే తొలిసారని పేర్కొన్నారు. ఈ సమావేశాలలో డిఎన్ఆర్ కళాశాల అసోసియేషన్ కరస్పాండెంట్ అండ్ సెక్రటరీ, నియోజకవర్గ TDP మాజీ కన్వీనర్ గాదిరాజు సత్యనారాయణరాజు (బాబు) పాల్గొనడం గమనార్హం. సీనియర్ కౌన్సిలర్ ఐజాక్ బాబు తో పాటు పలువురు పార్టీ సీనియర్స్ ను సన్మానించారు.
