సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో వాడవాడలా స్వర్గీయ నందమూరి తారకరామారావు జన్మ దినవేడుకలు, మహానాడు 2వ రోజు వేడుకలు జరిగాయి. ముందుగా స్థానిక టిడిపి కార్యాలయంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించిన అనంతరం టిడిపి రాష్ట్ర మాజీ కోశాధికారి మెంటే పార్థసారథి మాట్లాడుతూ ఎన్టీఆర్ అంటే నేటి తరానికి కూడా గౌరవం ఉందని ఆయన చెప్పిన మాటలను ఆచరణలోకి తీసుకురావటం వల్ల తెలుగుదేశం పార్టీ బలమైన రాజకీయ శక్తిగా ఎదిగిందని ఆయన చూపిన మార్గంలోనే టిడిపి పయనిస్తుందన్నారు. అనంతరం ఇన్చార్జి తోట సీతారామలక్ష్మి నియోజకవర్గ పరిశీలకులు చెరుకూరి సాయిరాంతో కలిసి భీమవరం రెండో పట్టణంలోని క్లస్టర్ 7, భీమవరం మండలంలోని క్లస్టర్-10 బేతపూడి మహానాడు సమావేశ వేదిక, క్లస్టర్-11 కొమరాడ రూరల్ బ్యాంక్ వద్ద మహానాడు వేదిక, వీరవాసరం మండలంలోని క్లస్టర్-1 కొనితివాడ, వీరవాసరంలోని క్లస్టర్ -2 మహానాడు వేదికలను సందర్శించారు. భీమవరం నియోజకవర్గ క్లస్టర్ -8 క్లస్టర్ మహానాడు సమావేశంలో టిడిపి సీనియర్ నాయకులు మెంటే పార్థసారధి కేక్ కట్ చేసి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు.అన్ని చోట్ల టీడీపీ క్యాడర్ కు భోజన ఏర్పాట్లు చేసారు అనంతరం టిడిపి సీనియర్ నాయకులు మెంటే పార్థసారథి ముదునూరి సూర్యనారాయణరాజు మద్దుల రాము చల్లబోయిన గోవింద్ ఎండి షబీనా ఎస్డీ నసీమా బేగం మాదాసు కనకదుర్గ దండు రామరాజు కొల్లిపాకుల దుర్గాప్రసాద్ లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ కన్వీనర్లు పామర్తి వెంకటరామయ్య, అల్లూరి సుబ్రహ్మణ్యరాజు , పడమట సోమేశ్వరరావు ,మెంటే గోపి ఎండి షాబు ఎద్దు ఏసుపాదం, తిలక్ మైలబత్తుల ఐజాక్ బాబు పాపోలు ఏడుకొండలు గ్రామ, పట్టణ, మండల కమిటీల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
