సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల ప్రొఫెసర్ నాగేశ్వర రావు ను అరెస్ట్ చెయ్యాలని జనసేన నేతలు ఏపీలో కేసులు పెట్టడం దానితో తెలంగాణాలో నాగేశ్వర రావుకు మద్దతుగా పెద్ద ఎత్తున నిరసనలు ప్రబలి.. పలువురు సీనియర్ జర్నలిస్ట్ లతో పాటు తెలంగాణ వాదులు ఆకరికి కొందరు తెలంగాణ ఎమ్మెల్యేలు సైతం పవన్ కళ్యాణ్ ను, చంద్రబాబు ను తీవ్ర పదజాలంతో విమర్శించి, సిగ్గు లేకుండా హైదరాబాద్ లో ఉంటున్నారని, ముట్టడిస్తాం, త్రొక్కుతాం.. అని హెచ్చరించే పరిస్థితి వచ్చింది. సున్నితమైన సమస్యగా తెలంగాణ ప్రభుత్వం కూడా మౌనం వహిస్తుంది. తెలంగాణ జనసేన నేతల ప్రెస్ మిట్ లను అడ్డుకొంటున్నారు. మాజీ మంత్రులు కవిత, హరీష్ రావులు కూడా హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ ఇతర పార్టీల నుండి మద్దతు రాకపోవడంతో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఏపీలోని స్థిరమైన రాజకీయ శక్తిగా ఎదిగిన తర్వాత, ఇప్పుడు తెలంగాణలో కూడా పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఆయన అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే వచ్చే జూన్ 2వ తేదీన హైదరాబాద్ వేదికగా తెలంగాణ జనసేన ముఖ్య నాయకులతో రానున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికలతో పాటు భవిష్యత్తులో రాబోయే ఎన్నికలే టార్గెట్‌గా పవన్ కల్యాణ్ ఒక కీలక సమావేశాన్ని నిర్వహించనున్నారు. తమను ఎలా అడ్డుకుంటారో తాము కూడా చూస్తామంటూ జనసైనికులు సవాల్ విసురుతున్నారు. చూడాలి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *