సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం నందు నేడు, ఆదివారం పట్టణం సుభిక్షంగా ఉండాలని, శ్రీ అమ్మవారి భక్తులకు సుఖశాంతులు కలగాలని పౌర్ణమి సందర్భంగా చండీహోమం ను దేవస్థానం ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లిఖార్జున శర్మ మరియు వేదపారాయణ దారులు ఘనంగా నిర్వహించారు. ఈ హోమం లో 80 మంది పైగా దంపతులు పాల్గొన్నారని, పరోక్ష పధ్ధతిలో కూడా.. మరి కొంతమంది పాల్గొన్నారు అని ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలియచేసారు…ఆలయ ధర్మకర్తలు వుదీసి మీనాక్షి, గుసిడి జానకి నాగ శిరీష, పాపొలు ఏడుకొండలు పాల్గొన్నారు
