సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అల్లూరి సీతారామరాజుకు మరో ప్రతిరూపం.. సూపర్ స్టార్ కృష్ణ జన్మదినం నేపథ్యంలో నేడు, ఆదివారం భీమవరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అయన అభిమానులు అన్నసమారాధనలు పేదలకు వస్త్ర దానాలు నిర్వహిస్తున్నారు. ఆయన వీర అభిమానులు రాజకీయాలలో కూడా సంచలనాలు సృష్టిస్తారు. కొండను సైతం ఢీ కొట్టే మనస్తత్వం కలిగి ఉంటారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి క్రిషన్ రెడ్డి, మాజీ మంత్రి తలసాని, భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్, అసెంబ్లీ ఉప సభాపతి రఘురామా కృష్ణంరాజు ఇలా ఎందరికో ఆయన స్ఫూర్తి.. మహా అందగాడు అయిన అయన తెలుగు వారికే కాదు భారతీయ సినీ పరిశ్రమకు కృష్ణ ఒక ‘బాహుబలి’. మరల అటువంటి వ్యక్తి పుట్టాడేమో? తెలుగు సినీ లెజెండ్ ..భారతీయ సినీ చరిత్రలో 2,500 అభిమాన సంఘాలతో వీరాభిమానులును సంపాదించుకొన్న ఏకైక హీరో కృష్ణ మాత్రమే.. ప్రపంచ చరిత్రలో ఏ సినీ హీరో, ఏ సినీ ప్రముఖుడు సాధించని అద్భుతాలు ఎన్నో చేసిన వ్యక్తి. ఎన్నో వేల మందికి ఉపాధిని కల్పించిన ధీరుడు.. హీరో కృష్ణ , నిర్మాతగా, దర్శకుడుగా, స్టూడియో అధినేతగా, థియేటర్స్ నిర్వాహకుడిగా, సినిమాల డిస్ట్రిబ్యూటర్స్ గా, హిందీ సినిమాలు దక్షిణా భారతంలో విడుదల చేసే భారీ డిస్ట్రిబ్యూటర్లుగా, భారతీయ టివి సీరియల్స్ లో సైతం నిర్మాతగా, హీరోగా , ఇంకా రాజకీయాలలో తన అభిమాన హీరో ఎన్టీఆర్ ను సైతం ఢీ కొట్టిన సాహసి కృష్ణ. ఏలూరు లోక్ సభకు ఎంపీగా ఎన్నికయి .. అందులేడు .. ఇందులేడు అన్నరీతిలో సాహసానికి చిరునామాగా మారిపోయారు సూపర్ స్టార్ కృష్ణ.. పాన్ ఇండియా సినిమాకు తోలి మార్గదర్శి దిగ్గజం. 350 చిత్రాలలో హీరోగా నటించిన ఏకైక భారతీయ సినీ హీరో కృష్ణ. ఆయన కార్యదక్షత, మంచితనం, సాహసం తెలుగువారి గుండెలలో ఎప్పుడు సజీవమే..
