సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేటి సోమవారం భారీ లాభాలతో మొదలైన ఇండియన్ స్టాక్ మార్కెట్ సూచీలు ఆ తర్వాత క్రమంగా కిందకు దిగి వచ్చాయి. క్రూడాయిల్ ధరలు తగ్గడం, డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి (94.81) బలపడడం వంటి కారణాలతో సూచీలు లాభాలతో మొదలయ్యాయి. గత సెషన్ ముగింపు సెన్సెక్స్(74,775)తో పోల్చుకుంటే నేడు సోమవారం ఉదయం దాదాపు 500 పాయింట్ల లాభంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత ఒడిదుడుకులకు లోనైంది. ఆ తర్వాత క్రమంగా కిందకు దిగి చివరకు సెన్సెక్స్ 508 పాయింట్స్ నష్టాలతో ముగిసింది. .అయితే గరిష్ఠాల వద్ద మదుపర్లు అమ్మకాలకు దిగడంతో సూచీలు దిగి వచ్చాయి. మరోవైపు అమెరికా-ఇరాన్ మధ్య మొదలైన దాడులు, బ్యాంకింగ్ రంగంలో అమ్మకాలు సూచీలను వెనక్కి లాగి వేస్తూ చివరకుసెన్సెక్స్ 508 పాయింట్స్ నష్టాలతో ముగిసింది. ఈ నేపథ్యంలో నిఫ్టీ కూడా చివరకు 165 పాయింట్స్ నష్టాలతో ముగిసింది.
