సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్:. భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి దేవాలయంలో శ్రీ అమ్మవారిని సంపూర్ణ బంగారు అలంకారం నిమిత్తం 2న్నర దశాబ్దాలుగా భక్తులు దాతలు కృషి నేపథ్యంలో వజ్రాల కిరీటం ఆభరణాలు ఆయుధాలు తో సహా ఇప్పటికే శ్రీ అమ్మవారు సుమారు 60 శాతం నిలువెత్తు బంగారు తల్లిగా భక్తులను తన్మయులను చేస్తున్నారు. చేస్తున్నారు. ఇక స్వర్ణమయం వేగం పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో స్థానిక ఎమ్మెల్యే పులపర్తి రామంజనేయులు వారి ఆద్వర్యంలో, శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి ని, స్వర్ణమయం చేయు కమిటీ ఇటీవల ఏర్పాటు చెయ్యడం జరిగింది. ఆ కమిటీ తాజగా తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. 1.శ్రీ అమ్మవారికి ప్రస్తుతం 52 కేజీలు బంగారం వస్తువులు నిత్య అలంకరణలో ఉన్నవి. 2. ప్రస్తుతం హుండీలు ద్వారా గాని, భక్తులు సమర్పించినది గాని 2026 మార్చి నెలాఖరు నాటికి 23 కేజీలు 430 గ్రాములు అందుబాటులో ఉన్నవి. 3. ప్రస్తుతo ప్రభుత్వంచే నియమించబడిన అధికారులు, అనదికారులు కమిటీ భక్తుల నుండి ఇంకా 27 కేజీలు బంగారం లక్ష్యంగా సేకరించి ఇప్పటికే దేవస్థానం వద్ద ఉన్న 23 కేజీలు వెరసి ఇంకా 50 కేజీలు బంగారంతో సంపూర్ణ స్వర్ణమయంలో భాగంగా ప్రభుత్వం ఇచ్చిన గడువు 3 సంవత్సరంల వ్యవదిలో పూర్తి చేయుటకు ప్రస్తుత కమిటీ కృషీ చేస్తామని ప్రకటించారు. నూతన కమిటీ ఆధ్వర్యంలో ఈసారి తొలివిడతలో 20 కేజీలు తో బంగారం అలంకరణ వస్తువులుతో చేయించడానికి సిద్ధంగా ఉన్నారని దేవస్థానం అసిస్టెంట్ కమీషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ తెలిపారు.
