సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల తెలంగాణ వాదులు ,మేధావులు,మంత్రులు ఎమ్మెల్యేలు, జర్నలిస్టులు మూకుమ్మడిగా పవన్ ఫై దారుణమైన పదజాలంతో తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో.. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఉప సభాపతి రఘురామా కృష్ణంరాజు తాజగా విడుదల చేసిన ఒక ప్రకటనలో యధాతధంగా.. ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిపై కొందరు చేసిన అనుచిత వ్యాఖ్యలు, బెదిరింపులు తీవ్ర విచారకరం. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలను హుందాగా వ్యక్తపరచాలే తప్ప, ఇలాంటి బెదిరింపు రాజకీయాలకు చోటు లేదు. పవన్ కళ్యాణ్ గారి నాలుక కోస్తామంటూ బెదిరించడం అత్యంత దారుణం. ఇలాంటి బెదిరింపు రాజకీయాలను ప్రజలు ఏమాత్రం హర్షించరు. పవన్ కళ్యాణ్ ప్రజాజీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ, ప్రజల కోసం అనునిత్యం శ్రమిస్తున్న నాయకుడు…తెలంగాణ ప్రజల కోసం మాట్లాడే హక్కు, అవసరమైతే వారి కోసం పోరాడే హక్కు తెలంగాణను ప్రేమించే ప్రతి ఒక్కరికీ ఉంటుంది. రెండు తెలుగు రాష్ట్రాలు ఎల్లప్పుడూ పరస్పర గౌరవం, సోదరభావంతో ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నాను. పవన్ కళ్యాణ్ కి నా పూర్తి మద్దతు ఉంటుంది అని రఘురామా పేర్కొన్నారు.
