సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు భీమవరం పురపాలక సంఘం పరిధిలోని రోజుకో వార్డ్ చప్పున నేడు, బుధవారం 5వ వార్డు నాగేంద్రస్వామి గుడి వద్ద (03.06.2026) “ఆపరేషన్ క్లీన్ స్వీప్” కార్యక్రమాన్ని అసిస్టెంట్ కమిషనర్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా వార్డులోని ప్రధాన రహదారులను శుభ్రపరచడం, కాలువలను పరిశుభ్రం చేయడం, డ్రైనేజీలలో పేరుకుపోయిన సిల్ట్‌ను తొలగించడం, చెత్తాచెదారాన్ని సేకరించి తరలించడం వంటి విస్తృత పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టారు. ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణం కల్పించడం, వర్షాకాలంలో నీటి నిల్వలు, దోమల వ్యాప్తి మరియు పారిశుధ్య సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకొంటామని తెలిపారు.ప్ర జలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, చెత్తను కాలువలు మరియు రహదారులపై వేయకుండా పురపాలక సంఘానికి సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ (MHO) సోమశేఖర్, 4వ వార్డు టీడీపీ అధ్యక్షులు ఇందుకూరి సుబ్రహ్మణ్యం రాజు,రంగసాయి, గంధం రాధా, టీడీపీ నాయకురాలు రజియా బేగం, రాయలం మాజీ ఎంపీటీసీ శ్రీలక్ష్మి పారిశుధ్య అధికారులు,సిబ్బంది మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *