సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: బిహార్‌లో నేడు, సోమవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నెల్లూరు జిల్లాకు చెందిన ముగ్గురు యాత్రికులు మృతి చెందారు. ఈనెల 1న నెల్లూరు జిల్లా నుంచి పుణ్యక్షేత్రాల దర్శనానికి 40 మంది యాత్రికులు బస్సులో బయలుదేరారు. వారణాసి వెళ్తుండగా లారీని ఓవర్‌టెక్ చేయబోయి యాత్రికుల బస్సు ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో ఆత్మకూరుకు చెందిన ఒకరు, సంగం మండలానికి చెందిన ఇద్దరు దుర్మరణం చెందారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు నెల్లూరు జిల్లా యాత్రికుల మృతిపై మంత్రి నారాయణ, మరియు సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. బిహార్ అధికారులతో అత్యవసర సంప్రదింపులు జరిపారు. మృతుల కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
