సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, పశ్చిమగోదావరి జిల్లా సిద్ధాంతంలో జరిగిన బహిరంగ సభలో రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాలను సీఎం చంద్రబాబు పంపిణీ చేశారు.అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. ఈ జిల్లా అంటే తనకు ఎంతో ఇస్తామని, టీడీపీ కి ఎప్పుడు అండగా ఉంటుందని,ఇక్కడ ఆక్వా రైతుల కోసం ప్రత్యేక ద్రుష్టి పడతాననని హామీ ఇచ్చారు. ఈ జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి కి తన సహకారం ఉంటుందన్నారు. ఆగస్టు 15వ తేదీ నాటికి సంజీవని పథకం తీసుకువస్తామని అందరికీ మెరుగైన వైద్య సేవలు అందిస్తామని పేర్కొన్నారు. ప్రతీ ఒక్కరికీ రెండున్నర లక్షలతో యూనివర్సల్ హెల్త్ స్కీమ్ తీసుకువస్తామని తెలిపారు. ఏపీలో రాబోయే బస్సులన్నీ ఎలక్ట్రిల్, ఏసీవేనని వివరించారు. భవిష్యత్తు ఎన్నికల్లో గొడ్డలి పార్టీ వైసీపీ నేతలకు తగిన గుణపాఠం ప్రజలు చెప్పాలని సీఎం చంద్రబాబు పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమాలలో మంత్రి నిమ్మల రామానాయుడు తో పాటు భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు తో సహా పశ్చిమ గోదావరి జిల్లా కూటమి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు పాల్గొన్నారు
