సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇకపై దశబ్దాలనాటి పాత సిస్టంలతో రైల్వే టికెట్స్ కు ఇబ్బందులు పడనక్కరలేదు. దేశంలో ఈ ఏడాది ఆగస్టు నుంచి టికెట్ల రిజర్వేషన్ నూతన పీఆర్ఎస్(ప్రయాణికుల రిజర్వేషన్ వ్యవస్థ)లోకి మారనుంది. తద్వారా టికెట్ బుకింగ్ మరింత వేగవంతం, సులభతరం అవుతుందని రైల్వేశాఖ పేర్కొంది. దీని పురోగతిని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఢిల్లీలోని రైల్‌భవన్‌లో సమీక్షించారు.. ప్రస్తుతం కొనసాగుతున్న రిజర్వేషన్ వ్యవస్థను 1986లో ప్రవేశపెట్టారు. 2002లో ఇంటర్నెట్ ఆధారిత టికెట్ బుకింగ్‌ను తీసుకొచ్చారు. దీంతో రిజర్వేషన్ కౌంటర్ల వద్దకు రావడం కంటే 88 శాతం టికెట్ల బుకింగ్ ఆన్లైన్ ద్వారానే జరుగుతోంది. గతేడాది జూలైలో ప్రారంభించిన రైల్‌వన్ యాప్‌ను 3.5కోట్ల మందికిపైగా డౌన్లోడ్ చేసుకోగా.. ప్రతిరోజూ 9.29లక్షల టికెట్లు బుక్ అవుతున్నాయని రైల్వేశాఖ తెలిపింది. అలాగే, వెయిటింగ్ లిస్ట్ టికెట్ కన్ఫర్మేషన్ అయ్యే అవకాశాన్నిA I ద్వారా అంచనా వేసే సదుపాయాన్ని ఈఏడాది అందుబాటులోకి తెచ్చారు. దీని కచ్చితత్వం 53నుంచి 94 శాతానికి పెరిగింది. అయితే ఇక ఆగస్టు నుండి మరింత సులువుగా… చూద్దాం
