సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధిత కుటుంబాలనుకేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ , మంత్రి నారా లోకేశ్ ,హోంమంత్రి అనిత, ఎంపీ భరత్, పరామర్శించారు. ఈరోజు(మంగళవారం) ఉదయం కేజీహెచ్ ఆస్పత్రికి చేరుకున్న మంత్రులు .. మార్చురీలో ఎంతమంది ఉన్నారనే దానిపై జాయింట్ కలెక్టర్ విద్యాధరిని అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో చనిపోయిన ఎమినిది మంది బంధువులను పరామర్శించారు. వారి నుంచి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు.మృతుల కుటుంబాలకు 25 లక్షలు రూపాయలు చప్పున ప్రభుత్వ నష్టపరిహారం ప్రకటించారు. ఈనేపథ్యంలో స్థానిక కార్మిక నేతలు తమకు ప్లాంట్ లో రక్షణ లేదని, ప్రభుత్వ సాయం ఫై మంత్రి లోకేష్ ఫై పలు ప్రశ్నలు వర్షం కురిపించారు. దానితో అసహనం కు లోనయిన లోకేష్ నేను బాధిత కుటుంబాలను పరామర్శించడానికి అంత దూరం నుండి వచ్చాను.. మీ ఇంటిలో వాళ్ళు ఎవరు చనిపోలేదు కదా? ఎందుకు మధ్యలో,,అనడంతో స్థానిక నేతలు కామ్రేడ్ లు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆపై సెవెన్ హిల్స్ ఆస్పత్రికి వెళ్లి స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి సెవెన్ హిల్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ ఆదేశాలతో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ నియమించిన త్రీ మెన్ కమిటీ.రంగంలోకి దిగింది. ఇప్పటికే బొకారో నుండి విశాఖపట్నం చేరుకున్న త్రీ మెన్ కమిటీ సభ్యులుతో నేటి సాయంత్రం శ్రీనివాస వర్మ. భేటీ కానున్నారు,
